తెలుగుజాతిని నెం.1గా చేసే బాధ్యత అందరిదీ: మంత్రి నారా లోకేష్
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించి తెలుగుజాతిని నెం.1గా తీర్చిదిద్దే బాధ్యతను అందరూ తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఎన్నారైలకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్నారై టీడీపీ సెంట్రల్ కమిటీ కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత కష్టకాలంలో ఎన్నారైలు అందించిన మద్దతును గుర్తుచేసుకుంటూ, పార్టీ కోసం వారు చేసిన పోరాటాన్ని లోకేష్ కొనియాడారు.