యాదగిరిపల్లిలో 9 అడుగుల కొండచిలువ కలకలం: సురక్షితంగా బంధించిన అటవీశాఖ అధికారులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లి గ్రామంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాచకొండ చిన్నరాజు ఇంట్లోకి కొండచిలువ రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో స్నేక్ క్యాచర్లు అక్కడికి చేరుకుని కొండచిలువను విజయవంతంగా బంధించారు. దీంతో కాలనీవాసులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.