విద్యార్థుల కోసం లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరం
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్లు
ఆమనగల్లు పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ వైద్యులు చంద్రశేఖర్ ఈ శిబిరంలో విద్యార్థులకు పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు అందజేశారు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు మొబైల్ ఫోన్ల వినియోగం తగ్గించాలని కౌన్సిలర్ రాము హితవు పలికారు.