'కొత్త పింఛన్లకు దరఖాస్తులు ప్రారంభం': అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం
రిపోర్టర్: హరి
స్థలం: Andhra Pradesh
రాష్ట్రంలో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తూ సెప్టెంబరు 7 నుంచి 16 వరకు స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డుతో పాటు బియ్యం కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని, కేటగిరీని బట్టి అదనపు పత్రాలు అందజేయాలని అధికారులు సూచించారు.