'మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు': నెల్లూరు పోలీసుల విస్తృత ప్రచారం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Nellore
మహిళలు, బాలికలు మరియు చిన్నారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు నెల్లూరు జిల్లా పోలీసులు నడుం బిగించారు. ఇందులో భాగంగా శక్తి యాప్, ఆపరేషన్ చిన్నారి తల్లి, మరియు ఆపరేషన్ దండాయనలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ప్రదర్శనలు చేపడుతూ ప్రజలను, విద్యార్థినులను అప్రమత్తం చేస్తున్నారు.