సూర్యాపేట జిల్లాలో రేషన్ డీలర్‌పై సస్పెన్షన్ వేటు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామంలోని రేషన్ దుకాణం డీలర్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్లు హుజూర్నగర్ ఆర్డీవో తెలిపారు. డీలర్ సస్పెన్షన్‌తో రేషన్ కార్డుదారులకు సరుకుల పంపిణీలో ఎలాంటి అంతరాయం కలగకుండా వడిత్య శ్రీనుకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా సరుకులు పంపిణీ చేయాలని, పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు.