ఉపాధ్యాయ సర్వీసు నిబంధనలలో మార్పులు: గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలలో పలు ముఖ్యమైన సవరణలు చేస్తూ ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో మున్సిపల్ పాఠశాలల పరిపాలనా బాధ్యతలను విద్యాశాఖకు అప్పగించినందున ఈ సవరణలు చేసినట్లు వెల్లడించారు. ఉపాధ్యాయుల సర్వీసంతా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ పరిధిలోనే కొనసాగుతుందని, ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-2 పోస్టులకు ప్రాంతీయ సంయుక్త సంచాలకులే అపాయింటింగ్ అథారిటీగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.