కాణిపాకం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఘనంగా పూర్తిచేసిన ఆలయ అధికారులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఐరాల
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఈవో కిషోర్, ఆలయ చైర్మన్ మనీ నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను అత్యంత ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించినట్లు వారు తెలిపారు. పవిత్రమైన ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేస్తున్న భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది.