మహిళలపై దాడులపై ఆవేదన వ్యక్తం చేసిన కృతి సనన్
రిపోర్టర్: వెంకట్
స్థలం: ముంబై
దేశంలో మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై బాలీవుడ్ నటి కృతి సనన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఆడపిల్లలు అడుగడుగునా భయంతో బతకాల్సిన పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. స్త్రీలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమాజంలో మహిళల పట్ల ఉన్న దృక్పథంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.