గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో మెరిసిన నాల్గు ఏపీ నగరాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: విశాఖపట్నం

వేగవంతమైన ఆర్థిక పురోగతి సాధిస్తున్న విభాగంలో ఏపీకి చెందిన గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ నగరాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ, మానవ వనరులు, జీవన ప్రమాణాలు, పర్యావరణం, పాలన అనే ఐదు అంశాలను పరిశీలించి ఈ ర్యాంకింగ్లను ప్రకటించారు. 2050 నాటికి భారతీయ నగరాలు ఆర్థిక, వ్యాపార సేవల వృద్ధిలో ప్రపంచంలోనే ముందంజలో ఉంటాయని నివేదిక స్పష్టం చేసింది.