ప్రేమ పేరుతో మోసం: చైర్మన్ ఇంటి ఎదుట యువతి నిరసన
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ముందు ఓ యువతి తీవ్ర ఆందోళనకు దిగింది. ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ తనను ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక నాయకులు, బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది.