హైదరాబాద్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి కావాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు పారదర్శకమైన విధానంలో ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. సాఫ్ట్వేర్ ద్వారా లాటరీ తీసి అర్హులకు ఇందిరమ్మ ఫ్లాట్లు అందిస్తామని వెల్లడించారు.