ఇండోర్ ఎస్‌జీఎస్‌ఐటీఎస్‌లో ఇక హిందీ మాధ్యమంలో సివిల్ ఇంజనీరింగ్ కోర్సు

రిపోర్టర్: శివ స్థలం: ఇండోర్

మధ్యప్రదేశ్‌లోని ఎస్‌జీఎస్‌ఐటీఎస్‌ కళాశాల సివిల్ ఇంజనీరింగ్‌లో హిందీ మాధ్యమ కోర్సును ప్రారంభించింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా 30 సీట్లతో ఈ బ్యాచ్‌ను మొదలుపెట్టారు. హిందీలో చదివే విద్యార్థులకు చివరి సంవత్సరంలో ప్రభుత్వం రూ. 2 లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. భాషా అడ్డంకులను తొలగించి, సాంకేతిక విద్యను మాతృభాషలో సులభతరం చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.