స్థానిక ఎన్నికల ప్రచారంలో కొత్త ట్రెండ్: కిరాయికి మనుషులు, భారీ ఖర్చులు

రిపోర్టర్: సతీష్ స్థలం: గుంటూరు

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు కార్యకర్తల కొరత తీవ్రంగా వేధిస్తోందని గుంటూరు నగరంలో పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటి ప్రచారం కోసం కిరాయి మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నామని, ఒక్కొక్కరికి రోజువారీ కూలీతో పాటు భోజనం, మద్యం ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని అభ్యర్థులు వాపోయారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో వర్షాలు కురిస్తే ప్రచారానికి ఆటంకం కలుగుతుందనే ఆందోళన వారిని వెంటాడుతోంది.