ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Andhra Pradesh

సీఎం క్యాంప్ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ నేడు సమావేశమయ్యారని CMO Andhra Pradesh వెల్లడించారు. ఈ భేటీకి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్కు మంత్రి శ్రీ నారా లోకేష్ సాదర స్వాగతం పలికారని పేర్కొన్నారు. అలాగే శ్రీశైల శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జున స్వామి దేవాలయంలో జరిగే శరన్నవరాత్రి మహోత్సవాలకు రావాలని కోరుతూ దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు సీఎంను ఆహ్వానించారని అధికారులు తెలిపారు.