రాష్ట్రంలో తుపాను నష్టాలపై ప్రభుత్వ తీరును ఎండగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
రిపోర్టర్: నరేష్
స్థలం: Andhra Pradesh
తీవ్ర తుపాను మరియు వరదలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కనీసం ఏ దేశానికి వెళ్లారో కూడా చెప్పకుండా విదేశీ పర్యటనలకు వెళ్లడం దారుణమని ఆక్షేపించింది. బాధితులను ఆదుకోవడంలో, సహాయక చర్యలు అందించడంలో యంత్రాగం పూర్తిగా విఫలమైందని ఆరోపించింది. మరోవైపు పోలీసుల ఏకపక్ష తీరుపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని వెల్లడించింది.