వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పెందుర్తి

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పెందుర్తి మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయాలని వారు కోరినట్లు సమాచారం అందుతోంది.