అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ప్రమాదంపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
రిపోర్టర్: సురేష్
స్థలం: అదిలాబాద్
అదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడుతూ, సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గాయపడిన పసిపిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని, మృతి చెందిన కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కేటీఆర్ కోరారు.