గణేష్ నిమజ్జన వేడుకల్లో భక్తులు సమన్వయంతో వ్యవహరించాలన్న మంత్రి పొన్నం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో జరిగిన ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయని, నిమజ్జన ప్రక్రియలో మండపాల నిర్వాహకులు, భక్తులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్, విద్యుత్, వైద్య సదుపాయాలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.