భారత్లో భారీగా తగ్గదల: పన్నెండేళ్లలో పేదరికం నుంచి బయటపడిన 49 కోట్ల మంది

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో తీవ్ర పేదరికం పన్నెండేళ్ల కాలంలో అత్యంత వేగంగా క్షీణించిందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. 2011లో 27.1 శాతంగా ఉన్న తీవ్ర పేదరికం రేటు, 2023 నాటికి 2.6 శాతానికి పడిపోయిందని వరల్డ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ కాలంలో సుమారు 496 మిలియన్ల మంది ప్రజలను విజయవంతంగా పేదరికం నుంచి బయటపడేసిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. వినియోగ వ్యయం పెరగడం, సంక్షేమ పథకాలే ఇందుకు కారణమని పేర్కొన్నారు.