ఆరోగ్య పరిస్థితిపై మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌కు కేసీఆర్ ఫోన్
రిపోర్టర్: సునీల్
స్థలం: హనుమకొండ
ఎంజీఎం వద్ద జరిగిన పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల తోపులాటలో తీవ్ర అస్వస్థతకు గురై హనుమకొండలోని అజారా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు. ఉద్యమ సమయాన్ని గుర్తు చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగించాలని, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వినయ్ భాస్కర్‌కు కేసీఆర్ భరోసా కల్పించారు.