అనారోగ్య పీడిత బాలికకు అండగా నిలిచిన మంత్రి నారా లోకేశ్
రిపోర్టర్: శివ
స్థలం: విజయనగరం
అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను తల్లి భుజాన వేసుకుని ఆసుపత్రికి వెళ్లిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పల్లపు దుంగాడకు చెందిన సంపూర్ణ అనే బాలిక వైద్యం కోసం పడిన కష్టాలపై వార్తలు రావడంతో ఆయన స్పందించారన్నారు. ఈయన సూచనల మేరకు రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ ఆ గ్రామానికి తన ఎంపీ లాడ్స్ నిధులతో అంబులెన్సు సమకూరుస్తానని ప్రకటించారని పేర్కొన్నారు.