'తిరుమలలో ఆధ్యాత్మిక వైభవం': ఎస్వీ మ్యూజియంను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Tirumala
తిరుమల ఆధ్యాత్మిక వైభవాన్ని నలుదిశలా చాటేలా ఏర్పాటు చేసిన నూతన ఎస్వీ మ్యూజియంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుమల విశిష్టత, శ్రీవారి మహత్యంను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలను ఆయన పరిశీలించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఈ ప్రాజెక్ట్ విశేషాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.