పాలకొల్లులో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ: మంత్రి నిమ్మల రామానాయుడు

రిపోర్టర్: సురేష్ స్థలం: పశ్చిమ గోదావరి

పాలకొల్లులోని బ్రాడీపేట అల్లు వెంకట సత్యనారాయణ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదమూడో విడతలో భాగంగా ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న నూట తొంబై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అందజేసినట్లు జలవనరుల శాఖ మంత్రి మరియు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పూలపల్లి సంధ్య మెరైన్స్ వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ఈ సైఫిల్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.