ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ లో నటించలేకపోవడంపై విద్యాబాలన్ తీవ్ర ఆవేదన
రిపోర్టర్: గోపి
స్థలం: ముంబై
భారతీయ సంగీత దిగ్గజం ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కాల్సిన బయోపిక్ లో నటించాలనే తన చిరకాల వాంఛ నెరవేరకపోవడంపై ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ రాజీవ్ మేనన్ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నప్పటికీ న్యాయపరమైన అడ్డంకులు, స్టే ఆర్డర్ కారణంగా ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని, ఆ పాత్రలో నటించలేకపోవడం తనను ఎంతగానో బాధిస్తోందని వెల్లడించారు.