ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 45వ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్ ఘన ప్రారంభం
రిపోర్టర్: శివ
స్థలం: గుంటూరు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని, క్రీడా స్ఫూర్తిని చాటిచెప్పాలని కోరుతూ 45వ ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌ను ప్రారంభించినట్లు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా చరిత్రలో ఈ విశ్వవిద్యాలయ క్రీడా ప్రాంగణానికి ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.