దార్జీలింగ్‌లో హనీమూన్ అగ్నిప్రమాదం నవ వధువుకు తీవ్ర గాయాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లోని దార్జీలింగ్‌లో హనీమూన్‌కు వెళ్లిన నవ దంపతులకు ఘోర ప్రమాదం ఎదురైంది. సిటోంగ్ ప్రాంతంలోని ఓ హోమ్‌స్టేలో బార్బెక్యూ సిద్ధం చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగి నవ వధువు నిఖిత సాహాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త సమీర్ దాస్‌కూ స్వల్ప గాయాలయ్యాయి. సిబ్బంది నిర్లక్ష్యంగా వంటనూనెకు బదులు కిరోసిన్ పోయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్వాహకుడు అంగీకరించగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.