ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని ఎంసీపీఐయూ డిమాండ్

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఎంసీపీఐయూ నాయకులు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కుంభం సుకన్య, వి.తుకారాం నాయక్ మాట్లాడుతూ.. పెంచిన ఆసరా పెన్షన్లను దసరా కానుకగా ఇవ్వాలని, మహిళలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. అలాగే పేదలకు ఇంటి పట్టాలు కేటాయించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.