ఆసియా కప్ క్వార్టర్స్‌లోకి భారత జూనియర్ మహిళల హాకీ జట్టు
రిపోర్టర్: హరి
స్థలం: India
ఆసియా కప్ జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో వరుసగా మూడో గెలుపు నమోదు చేసి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఎలైట్ గ్రూప్‌లో భారత్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది.