కొత్తపట్నం తీరంలో పీఓపీ విగ్రహాల వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం

రిపోర్టర్: శివ స్థలం: కొత్తపట్నం

ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో పీఓపీ విగ్రహాల నిమజ్జనం పర్యావరణానికి ముప్పుగా మారుతోంది. ఐదు వందలకు పైగా హానికర రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తీరంలోనే నిమజ్జనం చేయడం వల్ల అవి కరగకుండా పేరుకుపోయాయి. దీనివల్ల సముద్రపు నీరు రంగు మారి తీర ప్రాంతం తీవ్రంగా కలుషితమవుతోందని, దీనిపై తక్షణమే అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.