అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్: నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న వైభవ్ సూర్యవంశీ
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
అఫ్గానిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో అతడు నెట్స్‌లో చెమటోడ్చాడు. సంజు శాంసన్‌తో పోరులో తుది జట్టులో అతనికి స్థానం దక్కుతుందా లేదా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.