పాఠశాలలో భయానక ఘటన: పదో తరగతి విద్యార్థినిపై చెట్ల నరికే మిషన్తో దాడి
రిపోర్టర్: రమేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గోపిక లక్ష్మిపై ఓ సైకో చెట్ల నరికే యంత్రంతో విచక్షణారహితంగా దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘోర దాడిలో విద్యార్థిని కుడి చేయి తెగిపడగా ముఖంపై తీవ్రగాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితురాలిని వెంటనే అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. పరారైన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.