స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కీలక టెక్ టిప్: అత్యవసర సమయంలో హెల్ప్ అంటూ మూడుసార్లు అరవండి
రిపోర్టర్: నరేష్
స్థలం: Andhra Pradesh / Telangana
అత్యవసర పరిస్థితుల్లో ఫోన్లలో బటన్లు నొక్కాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఎమర్జెన్సీ సర్వీసులను సంప్రదించే సరికొత్త ఫీచర్ అందుబాటులో ఉందని టెక్ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. ఫోన్ మైక్రోఫోన్ ముందు హెల్ప్ అని మూడుసార్లు బిగ్గరగా అరిచి, ఆపై ఎస్ అని నిర్ధారిస్తే చాలని ఆయన వివరించారు. దీనిద్వారా క్షణాల్లో లొకేషన్ షేర్ కావడంతో పాటు వీడియో రికార్డింగ్ కూడా ఆటోమేటిక్గా ప్రారంభమవుతుందని, రద్దు చేయాలంటే కేన్సిల్ అని చెప్పాలని స్పష్టం చేశారు.