రైతులకు కీలక సూచన: ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే అధిక లాభాలు

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో నీటి ఎద్దడి పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ నీటితో పండే పల్లి, నువ్వులు, కందులు, పెసర్లు సాగు చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, సర్పంచ్ బేతి సాంబయ్య సూచించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆధునిక పద్ధతులను శాఖ అధికారులు వివరంగా రైతులకు వివరించారు.