ఆరేగూడెం పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం ఆరేగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కవిత మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అద్వితీయమని కొనియాడారు. రాధాకృష్ణన్ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.