జహీరాబాద్లో మాజీ సైనికుల సేవాభావం: కాలిబాట భక్తుల కోసం ఘనంగా అన్నదానం
రిపోర్టర్: మహేష్
స్థలం: సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు తమ సేవాభావాన్ని చాటుకున్నారు. తుల్జాపూర్ భవానీమాత దర్శనానికి కాలి నడకన వెళ్లే భక్తుల కోసం వారు ఈ ఏడాది కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్-ముంబయి జాతీయ రహదారిపై ముప్పై మందికి పైగా మాజీ సైనికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. దేశ రక్షణలో సేవలు అందించిన వారు ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.