భూముల కేటాయింపులపై ఉన్నత స్థాయి కమిటీని వేసిన సర్కార్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్రావు, జగదీశ్వర్ రెడ్డి హయాంలో జరిగిన భూముల కేటాయింపులు, రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 134 ద్వారా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సాంకేతిక, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన చైర్పర్సన్గా ఈ కమిటీ దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వనుంది.