క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం: మేడ్చల్ జిల్లాలో విషాదం

రిపోర్టర్: శివ స్థలం: మేడ్చల్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం క్వారీ గుంతలో ప్రమాదవశత్తు నీట మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో ఐదుగురు స్నేహితులు సరదాగా గడపడానికి వెళ్లగా, భోజనం తర్వాత ప్లేట్లు కడుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మృతులు రోహిత్, సయాన్ లుగా గుర్తించామని, హైడ్రా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారని పోలీసులు పేర్కొన్నారు.