మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న హీరో నాని
రిపోర్టర్: సునీల్
స్థలం: ములుగు
మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల సన్నిధిలో ప్యారడైజ్ చిత్ర యూనిట్ సందడి చేసినట్లు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెలిపారు. హీరో నాని, సంపూర్ణేష్ బాబుతో కలిసి మేడారానికి చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాని తులాబారం వేసుకుని డోలి వాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ 74 కిలోల బెల్లం బంగారాన్ని తల్లులకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెపై ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు.