అక్టోబర్ 16న గ్రాండ్‌గా నాన్న కుట్టి సినిమా విడుదల

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే నటుడు విజయ్ ఆంటోని తాజాగా నటిస్తున్న చిత్రం 'నాన్న కుట్టి'. ము. మారన్ దర్శకత్వంలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో యాక్షన్, కుటుంబ భావోద్వేగాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా సెలవులను పురస్కరించుకుని అక్టోబర్ 16న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.