ఇంటర్ పరీక్షల్ లో కీలక మార్పులు: విద్యార్థులకు ఇంటర్ విద్యా మండలి తీపి కబురు

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల్ లో పలు కీలక మార్పులు చేసేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోందని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరఖ్ నిబంధనలకు అనుగుణంగా బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలికి విద్యార్థుల్ లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాలను పరీక్షించేలా ప్రశ్నల రూపకల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముద్రించే కొత్త పాఠ్యపుస్తకాల్ లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.