దేశంలోనే అత్యంత చురుకైన యూనిట్ తెలంగాణ పీసీసీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

తెలంగాణ పీసీసీ దేశంలోనే అత్యంత చురుకైన కాంగ్రెస్ పార్టీ యూనిట్లలో ఒకటిగా నిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ది హిందు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం స్థానాలను గెలుచుకున్నామని స్పష్టం చేశారు. పార్టీ సాధించిన ముఖ్యమైన విజయాల్లో కుల గణన కీలకమని పేర్కొన్నారు.