జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహణ: ప్రజల నుండి వినతుల స్వీకరణ
రిపోర్టర్: శివ
స్థలం: జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించినట్లు ఎస్పీ జోగులాంబ గద్వాల వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అధికారుల సమక్షంలో అర్జీలను స్వీకరించడం జరిగిందని తెలిపారు. బాధితుల సమస్యలను ఓపికగా ఆలకించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.