ఖానాపూర్లో రూ. 2 కోట్లతో నూతన ఫైర్ స్టేషన్ పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన అగ్నిమాపక కేంద్రం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైన సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు.