పారిశ్రామికవేత్తలకు పూర్తి భరోసా: పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
రిపోర్టర్: వెంకట్
స్థలం: Telangana
తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, రాష్ట్రంలో పెట్టే ప్రతి పెట్టుబడికి తానే స్వయంగా భరోసా ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెట్టుబడుల విషయంలో విధానపరమైన నిర్ణయాలు, అవసరమైన ప్రభుత్వ సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలంగాణ సీఎంవో సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కానుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.