సూపర్‌స్టార్ రజనీకాంత్ జైలర్ 2 చిత్రం నుంచి బిందాస్ సాంగ్ విడుదల
రిపోర్టర్: శివ
స్థలం: చెన్నై
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటి నోరా ఫతేహీ నర్తించిన బిందాస్ అనే ప్రత్యేక ఐటెం సాంగ్‌ను చిత్ర యూనిట్ బుధవారం అధికారికంగా విడుదల చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాట సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.