బెంగళూరులో పవన్ హాన్స్‌కు ధృవ్ ఎన్జీ హెలికాప్టర్ల అందజేత
రిపోర్టర్: నరేష్
స్థలం: బెంగళూరు
బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ పవన్ హాన్స్‌కు తొలి విడతగా నాలుగు ధృవ్ ఎన్జీ సివిల్ హెలికాప్టర్లను అందజేయనుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సమక్షంలో ఎచ్‌ఏఎల్ సీఎండీ రవి కె ఈ హెలికాప్టర్లను పవన్ హాన్స్‌కు అందించనున్నారు. ఇదే వేదికపై భారతీయ వాయుసేనకు తేజస్ ఎమ్‌కే 1 ట్రైనర్ విమానాలు, హెచ్‌టీటీ-40 శిక్షణ విమానాలను కూడా అందజేయనున్నారు.