ఆసియా క్రీడల్లో షూటింగ్‌లో భారత్‌కు రజతం, కాంస్యం దక్కాయి

రిపోర్టర్: సురేష్ స్థలం: India

ఐచి-నగోయా ఆసియా క్రీడల్లో భారత షూటర్లు హిమాన్షు ధిల్లాన్ రజతం, రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో వీరు ఈ ఘనత సాధించగా, అంతకుముందు పార్థ్ మానేతో కలిసి టీమ్ ఈవెంట్ లోనూ రజతం కైవసం చేసుకుని దేశం గర్వపడేలా చేశారు.