అమెరికాలో గుండెపోటుతో సీనియర్ నేత ఎంఏ గఫూర్ కుమారుడు మృతి

రిపోర్టర్: రమేష్ స్థలం: కర్నూలు

సీపీఎం సీనియర్ నాయకుడు ఎంఏ గఫూర్ కుమారుడు కిరణ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెపోటుతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. శాన్హోసే నగరంలో అక్టోబర్ ఒకటో తేదీనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పది రోజులుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు తెలుగు సంఘాలను ఆశ్రయించగా ఈ విషాద ఘటన బయటపడింది. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన కిరణ్, అక్కడ పేపాల్ సంస్థలో సీనియర్ డేటా సైంటిస్టుగా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని కర్నూలుకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.