మరుగుదొడ్ల నిర్మాణ భారం లబ్ధిదారులపై పడొద్దు: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ వ్యయంలో లబ్ధిదారులు భరించాల్సిన మొత్తాన్ని పురపాలక శాఖ నిధుల నుంచే చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారులకు ఆర్థిక భారం కాకుండా చూసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిధులను కేటాయించాలని స్పష్టం చేశారు. తాగునీరు, వీధిదీపాలు, మౌలిక వసతుల కల్పనపై సమీక్ష నిర్వహించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.